మా కుమార్తె వివాహానికి రండి - చంద్రబాబుకు షర్మిల అహ్వానం
కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డ్
BreakInGuru, Chennapragada Bhanu · · రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి హైదరాబాద్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకకు తప్పకుండా హాజరై, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్లి పత్రికను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఏపీ నేతలు కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. తన కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని షర్మిల ఇదివరకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సహా పలువురు నేతలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డ్ అందజేశారు.