ప్రభుత్వం మీకు అండగా ఉంది – కొమ్ము చినబాబు

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలోని బాలయోగి గురుకుల పాఠశాల బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొమ్ము చిన్నబాబు సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి అక్కడి విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దళితుల విద్యకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.

నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలో పెయింటింగ్స్, ఎలక్ట్రిసిటీ, ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. వసతి గృహంలోని వంటశాలను సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. ఆహార నాణ్యత విషయంలో లోపాలుంటే తగిన చర్యలు తీసుకుక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా సిబ్బంది జీతాభత్యాల విషయాలు తెలుసుకొని వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందుకొని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని ఆయన పిల్లలకు సూచించారు.

నానాజీ . బి

రిపోర్టర్, ఏలేశ్వరం