గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో…..

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉషారాణితో పాటు పలు వార్డులోని టిడిపి నేతలు వైఎస్సార్ పార్టీలో చేరారు. గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పద్ధకలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను చూసి ఆకర్షితులై వారందరూ కూడా స్వచ్చందంగా వైసీపీలో చేరుతున్నారని గంగుల ప్రతాప్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్టీతో కలిసి పనిచేయడానికే ఈ రోజు యువత ఉత్సాహం చూపుతున్నారని, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిజెనదర రెడ్డి కూడా పాల్గొన్నారు.