పెట్రోబాంబ్ పేల్చిన నిర్మలా సీతారామన్

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ రేటునుంచి ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనని సోమవారం లోక్ సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముడి చమురు, పెట్రోల్, విమాన ఇంధనం, డీజిల్, సహజ వాయువు లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పన్ను భారం తగ్గి ప్రజలకు ఉపశమనం కల్గుతుందని అందరూ భావిస్తున్నారని అయితే ఈ ప్రతిపాదన ఇప్పట్లో లేదని తెలిపారు.