Home Blog
గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో…..
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉషారాణితో పాటు పలు వార్డులోని టిడిపి నేతలు వైఎస్సార్ పార్టీలో చేరారు. గంగుల ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పద్ధకలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనను చూసి ఆకర్షితులై వారందరూ కూడా స్వచ్చందంగా వైసీపీలో చేరుతున్నారని గంగుల ప్రతాప్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్టీతో కలిసి పనిచేయడానికే ఈ...
మోడీకి ముద్రగడ లేఖ ..
నిత్యవసర వస్తువుల ధరలు పెంపుదల తో ప్రజలు అల్లాడిపోతున్నారు..ప్రధాని మోదీకి.. మాజీమంత్రి ముద్రగడ లేఖ..
రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదల వలన దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలకు భరోసా ఇవ్వాలని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం నిత్యావసరాల ధరలుపై పడుతుందని, ఫలితంగా మధ్యతరగతి జీవితాల్లో చీకట్లు అలుముకుంటూనాయని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ...
పార్టీ విషయంలో వైఎస్ షర్మిలా తాపత్రయం ఇదే
తెలంగాణలో పార్టీ ఏర్పాట్లులో బిజీగా ఉన్న వైఎస్ షర్మిలా రాష్ర్టంలోని సమస్యలపై దృష్టి సారించారు. ఒకవైపు వైఎస్సార్ అభిమానులను ఏకతాటిపైకి తెస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఉద్యమ ఆకాంక్షలు నెరవేరయా లేదా తెలుసుకొనే పనిలో పడ్డారు. ఈ రోజు తెలంగాణలోని పలు యూనివర్సిటీ విధ్యార్ధులు, నిరుద్యోగులతో సమావేశం కానున్నారు.
తెలంగాణలోని కొత్త పార్టీ పెట్టేందుకు తగిన కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు వైఎస్ షర్మిలా. వైఎస్సార్ అభిమనులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి...
స్వామీజీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి – విష్ణు
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొనే స్వామీజీపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల క్షేమం కోరుతూ విశాఖ శ్రీ శారదా పీఠం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన...
చిన్నారికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసట
ఓ చిన్నారి కోక్లియార్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ కై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటపీ ఎం ఆర్ ఎఫ్ నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్ ఓ సీ అందజేతనేరుగా ఆసుపత్రి అకౌంట్ లో నగదు జమ చేశామని పీ ఎం ఆఫీస్ నుంచి సందేశం హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
దీర్ఘకాలికంగా వినికిడి సంబంధిత వ్యాధితో తో బాధపడుతున్న ఓ చిన్నారికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు .విశాఖపట్నం శారదా నగర్ ప్రాంతానికి చెందిన గుంటముక్కల తాతారావు చిన్నపాటి కార్పెంటర్ గా...
జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు – జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు ఆదాయం మూడువందల కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ డబ్బు ప్రభావంతోనే ఆయన ఎన్నికల్లో గెలుపొందుతున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంను ఎంతో అభివృద్ది చేశారని.. జగన్...
వాలంటీర్లకు జగన్ వరాలు
జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న వలంటీర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడింది ఏపీ సర్కార్. ఉగాది నాడు సేవారత్నా , సేవామిత్ర పేరుతో ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు పాలనను మెరుగుపరిచేందుకు ఐక్య రాజ్య సమితి నిర్ధేశించిన 17 సూత్రాలు అమలుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించే పనిలో పడింది.
జగన్ పాలనా పగ్గాలు చెప్పటిన తర్వాత తీసుకున్న కీలక విధానపరమైన నిర్ణయాలలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే ఈ...
కేసీఆర్ టు షర్మిలా
TRS పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్ సర్కిల్ లోని బుద్వేల్‌కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దయానంద్(డేవిడ్) ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన రాజీనామా లేఖను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డికి పంపినట్లు తెలిపారు.
అనంతరం ఆయన అనుచరులతో షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.
ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు – ఉత్తమ్
రాష్ట్రాన్ని మత పరంగా విభజించి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ పరిచయ సభలో ఆయన మాట్లాడురారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదని చెప్పుకొచ్చారు.యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. అదేవిధంగా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడి కూడా యువతను...
దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కాలంటే ..? – సీఎం జగన్
రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయిందని, పారిశ్రామికంగా, మౌలిక వసతులు పరంగా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వంటివి సాధ్యపడాలంటే కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోనే సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు, ప్రొడక్షన్, వ్యవసాయం, పౌష్టికాహారం తదుపరి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించినట్లు ఈ సంధర్భంగా...