జగన్ చరిత్రలో నిలిచిపోతారు – ఆర్. నారాయణమూర్తి

రైతుల పక్షపాతి మన సీఎం జగనని కొనియాడారు నటుడు, దర్శకుడు ఆర్. నాయరాయణ మూర్తి. ఏలేరు తాండవ కాలువల అనుసంధాన పనులకు ఆయన నిధులు మంజూరు చేయడం ద్వారా రైతుల్లో సంతోషం నింపారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఏ ప్రభుత్వం కూడా విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మెట్ట ప్రాంత రైతులను పట్టించుకోలేదని కానీ ముఖ్యమంత్రి జగన్ నిధులు మంజూరు చేయడం ద్వారా ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి పనులు చేపట్టాడాన్ని ఆర్. నారాయణ మూర్తి ప్రశంసించారు. ఆయన ఒక మీడియా చానెల్తో మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ప్రవహించే ప్రాంతంలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు.  తాను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి గతంలో ముఖ్యమంత్రి జగన్ను కలవడం జరిగిందని తెలిపారు. ఏలేరు తాండవ అనుసంధానం వల్ల సాగు, తాగునీటి సమస్య పరిష్కారమౌతుందని వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. అయితే వెంటనే స్పందించిన జగన్ నిధులు మంజూరు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. దీని ద్వారా ఈస్ట్ గోదావరి జిల్లా, అలాగే విశాఖ జిల్లా ప్రజలు సీఎం జగన్కు ఋణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా మంత్రలు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు కు కృతజ్ఞతలు తెలిపారాయన.