Home BreakInNews AP News కుంభమేళా కాదు .. కరోనా మేళా

కుంభమేళా కాదు .. కరోనా మేళా

కరొన వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది కుంభమేళా. నిబంధనలు గాలికి వదిలేయడంతో వందలాది మంది ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రియల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా రెండు లక్షల 30 వేల మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయాయి.

భక్తులు తో పాటు సాదువులు కూడా ఆర్టీపీసీఆర్  పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీని ప్రభావం అన్నీ రాష్ట్రాల మీద పడే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు కేసుల సంఖ్య పెరిగిన సరే మహా కుంభ మేళా ను వాయిదా వేయడం కుదరదని చెప్పింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఏప్రియల్ 30 వ తారీఖు వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేసారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ మేళాను రెండు వారాల ముందే ముగిస్తారన్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం జనవరిలో ప్రారంభమయ్యేది. కానీ కోవిడ నేపధ్య పరిస్థితిలలో ఈ సారి ఏప్రియల్ లో నిర్వహిస్తుతున్నారు.

మరో వైపు కుంబమేళాకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. పుణ్య స్థానాలు చేసేందుకు వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండడం ఆంధోళన కలిగిస్తుంది.