Home BreakInNews AP News ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సేవా గుణం

ఏలేశ్వరం హెల్పింగ్ యూత్ సేవా గుణం

మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుండటంతో హెల్పింగ్ యూత్ సేవా గుణాన్ని చాటుకున్నారు. హెల్పింగ్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు మరియు హాస్పిటల్ సిబ్బందికి పండ్లు, శానిటైజర్, మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనాని ఎదుర్కోవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ యూత్ సభ్యులు షేక్ ఆలీ షా, మద్దుల స్వరూప్, గ్రంధి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మా సంస్థ 2016 ఏర్పాటు చేయడం జరిగిందని.. నాటి నుండి నేటి వరకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దాతల సహాయం ఉంటే హెల్పింగ్ యూత్ అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ వెదురు అప్పారావు, పోక వెంకటేష్, సిరి బోలు శివ తదితరులు పాల్గొన్నారు.