విశాఖ ఉక్కు ఉద్యమంలో కేటీఆర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని మోడి ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమించి సాధించుకున్న స్టీలు ప్లాంట్ కు ఘనమైన చరిత్ర ఉంది. దీనితో భారతీయ జనతా పార్టీ మినహా ఆంధ్ర ప్రదేశ్ లోని మిగతా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు కోసం తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సాటి తెలుగు రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే మనమే స్పందించక పోతే మరి ఎవరు ముందుకు వస్తారన్న కేటీఆర్ అవసరమైతే తాను కూడా విశాఖకు వెళ్ళి ఉద్యమంలో పాల్గొంటానని తెలిపారు.       

దీంతో శనివారం మంత్రి కేటీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి, తెలుగు దేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అలాగే ప్రత్యక్షగా ఉద్యమంలో మద్దతు తెలిపాలని కోరారు ఆయన. దీనికిగాను అసెంబ్లీ సమావేశాలు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపానట్లు గంటా శ్రీనివాస రావు తెలుపారు.