రెండు నిమిషాల్లో ఆధార్

నువ్వేంటో నీ ఆధార్ చెబుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పధకాలు పొందాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయాలన్నా,కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, ఆసుపత్రిలో అడ్మిట్ కావాలన్న ఆధార్ ఉండాల్సిందే..అలా ఉంది ప్రస్తుత పరిస్తితి. అయితే ప్రతీ సారీ ఆధార్ మీ వెంట తీసుకెళ్లడం వీలుకాకపోవచ్చు లేదా ఇంట్లో మర్చిపోయి ఉండొచ్చు. అటువంటి సందర్భాలలో మీరు కంగరు పడాల్సిన అవసరం లేదు. మీ మొబైలు ఫోన్లో మీ ఆధార్ కార్డ్ ఎప్పుడైనా, ఎక్కడైనా రెండు నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.            

ఇలా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి :

  • ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొదట మీ మొబైల్ నెంబర్ను యూఐడీఏఐలో రిజిస్టరై ఉండాలి. 
  • తరువాత మీ ఫోన్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ను ఓపెన్ చూసుకోవాలి.
  • మీ దగ్గర ఆధార్ నెంబర్, ఎన్ రోల్ మెంట్ నెంబర్, వర్చ్యువల్ ఐడి ఉంటే వాటి ద్వారా  ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
  • తర్వాత మై ఆధార్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. 
  • క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP బటన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి తరువాత వెరిఫై చేయాలి. 
  • ఇ-ఆధార్ కాపీ మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. 
  • అయితే డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 
  • దానికి గాను మీ పేరులోని మొదటి 4 అక్షరాలు కేపిటల్గాను ,మీరు పుట్టిన సంవత్సరం, కలిపి మొత్తంగా ఎనిమిది డిజిట్స్ పాస్‌వర్డ్ను ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.