జగన్ ఒక రోజు ఆదాయం 300 కోట్లు – జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు  టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ఒక రోజు ఆదాయం మూడువందల కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు.  ఆ డబ్బు ప్రభావంతోనే ఆయన ఎన్నికల్లో గెలుపొందుతున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంను ఎంతో అభివృద్ది చేశారని.. జగన్ పార్టీతో పోటీపడి డబ్బులు పంచలేకే ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. కేవలం జగన్ సంక్షేమ పధకాలు చూసే ప్రజలు ఓటు వేశరని చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీ పంచిన డబ్బుకు తోడు స్థానిక పోలీసులు కూడా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏమిటో.. జగన్ ఏమిటో ప్రజలకు బాగా  తెలుసన్నారు.