బాబు చేసిన తప్పు అదే ..

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనేక రికార్డుల సృష్టించారు. ప్రతీ అంశాన్ని తన పార్టీ ప్రయోజనాలు, తన వ్యక్తిగత ప్రయోజనాలకు ముడిపెట్టి నిర్ణయాలు తీసుకోవడం లో ఆయన దిట్ట. వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇచ్చాయి.. మరికొన్ని చెడు ఫలితాలను ఇచ్చినవి ఉన్నాయి. అధికారం చేజిక్కుంచుకోవడం కోసం తాత్కాలికంగా ఎవరితోనైనా చెలిమి చేసి.. అవసరం తీరిన తర్వాత కట్ చేసి దూరం పెట్టడతారని ఆయన మీద ఉన్న ప్రధాన ముద్ర. ఒక్కప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పినా..  తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఆయన మాట చెల్లుబాటు కావడం లేదనే చెప్పాలి. ఆదరణ కరువైనదనే చెప్పాలి. సుమారు పదేళ్ళ పాటు (2004 నుంచి 2014 వరకు) ప్రతి పక్షంలో ఉన్నా కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ కి ఎక్కడాకూడా డామేజ్ కాలేదు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఉన్నంత దీనస్థితి ఎప్పుడు లేదనే చెప్పాలి. అందుకే ఆయన స్వరం మారింది. ప్రజలపై పబ్లిక్ గా విరుచుకుపడుతున్నారు. చేసిన పొరపాట్లు, తప్పులను మర్చిపోయి ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఇటీవల చంద్రబాబు చేసిన ప్రసంగాల ధోరణే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడు చేయని దుస్సాహసంగా చెప్పుకోవచ్చు.                 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్యాస్ట్ అండ్ క్యాస్ గా మారిపోయాయి. ఒక్కప్పుడు అంటే ఎన్టీఆర్ టైమ్ లో ఎన్నికలకు అయ్యే ఖర్చు పరితమితంగా ఉండేదని చెప్పుకోవచ్చు. తదుపరి కాలంలో చంద్రబాబు పార్టీ పగ్గాలు చెప్పటిన తర్వాత మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చెప్పటిన తర్వాత ప్రతీ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఒకవైపు డబ్బు మరోవైపు కులం కాదేది ఎన్నికలకు అనార్హం అంటూ గెలుపే ధ్యేయంగా సమీకరణాలు ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆయనకు ముద్ర ఉంది. కేవలం పొత్తులు, ఎత్తుగడలను మాత్రమే నమ్ముకుంటూ వచ్చి ఎన్నికల్లో గెలుపు సాధిస్తూ వచ్చారు ఆయన. మాస్ ఇమేజ్ లేని చంద్రబాబుకి గెలిచిన ప్రతీ సారీ ఆయన వ్యూహాలు, పొత్తులు మాత్రమే కలిసొచ్చాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందో అప్పుడు ఓడిపోతూ వచ్చారు. సీట్ల పంపిణీ దగ్గర నుంచి కుల సమీకరణలు వరకు ఎన్నికల వ్యూహాలను పక్కగా ప్లాన్ చేయడంలో దిట్ట చంద్రబాబు. ప్రస్తుతం అవే సమీకరణలు వికటించి తెలుగుదేశం ఓటమికి కారణమయ్యాయి. అది మర్చిపోయిన తాను ప్రజలను నిందించడం ఏమేరకు సబుబో ఆయనే ఆలోచించుకోవాలి.                                

అసలు చంద్రబాబు హయాంలోనే డబ్బు ప్రభావం తీవ్రంగా మారింది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయగల వ్యక్తులను ఎంపిక చేసుకొని వైసీపీ తన అభ్యర్ధులను ఎంపిక చేసుకుంది. అదే సమయంలో బాబు బిజెపితో వైరం తెచ్చుకొని ముందుకు వెళ్లారు. దాని  ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం నేతలకు ఆదాయపన్ను శాఖను వాడుకొని ఎక్కడికక్కడ చెక్ పెట్టుకొంటూ వచ్చింది కేంద్రం. బయటికి డబ్బు తీయాలంటే భయపడే వాతావరణం కల్పించింది. దాంతో వైసీపీకి ఫ్రీ హ్యాండ్ లభించినట్లయింది. దానికితోడు రెడ్డి సామాజిక వర్గానికి తోడు ఎస్టీ,ఎస్సీ, ముస్లిం ఓటు బ్యాంక్ కూడా పక్కగా కలిసొచ్చింది. చంద్రబాబు తన పరిధిని మించి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలుపుకోలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైతు రుణమాఫీ, కాపులకు రిజర్వేషన్లు వంటివి నెరవేర్చలేక చేతులెత్తేశారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడి స్వయంకృతాపరాధాలు. పార్టీ పరాజయానికి ముఖ్య  కారణాలు.