ఛైర్మన్ గొంతిన సురేష్ అక్రమాలు

సొసైటీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని లంపకలోవ సొసైటీ ఎదుట ఆంధోళనకు దిగారు రైతులు. ఛైర్మన్ గొంతిన సురేష్పై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు కోటి ముప్పై లక్షలు రూపాయాలు అక్రమం జరిగిందని, ఆయన వద్ద నుంచి తక్షణమే డబ్బులు వసూలు చేయాలని రైతులు కోరారు. దీనిపై అసిస్టెంట్ రిజిస్టర్ శివ కామేశ్వర రావు ఆధ్వర్యంలో విచారణ చెప్పటారు అధికారులు.సురేష్ ఛైర్మన్ గా వ్యవహరించిన 18 నెలల కాల వ్యవధి మొత్తం అవినీతిమయమంటూ నినాదాలు చేశారు. రైతుల ధాన్యం డబ్బులు మరియు ఇతర నిధులు మొత్తం కలిపి ఒక కోటి ముప్పై లక్షలు రూపాయల అవినీతి జరగినట్లు వారు అధికారులకు తెలిపారు. ఈ సంధర్భంగా శివ కామేశ్వర రావు మాట్లాడతూ రైతుల ఫిర్యాదుపై విచారణను చెప్పట్టినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.