Home BreakInNews AP News విశాఖ ఉక్కుపై కేంద్ర వైఖరి

విశాఖ ఉక్కుపై కేంద్ర వైఖరి

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు గాను నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేసినట్లు చెప్పాకొచ్చారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి షేర్‌ లేకపోయినా, అవసరమైనప్పుడల్లా ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏదైనా విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమైతే కోరుతున్నామని నిర్మలా సీతారామన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తప్ప మినహా అన్ని రాజకీయ పార్టీలు అలాగే  వివిధ ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి.