కరోనాతో జర జాగ్రత్త పిల్లలు…

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో ప్రజలు హడాలిపోతున్నారు. ముఖ్యంగా విధ్యార్ధులు కరోనాకు గురుకావడంతో తల్లిదండ్రులల్లో భయం పట్టుకుంది. దీనితో పిల్లలను స్కూల్ కి పంపాలంటే ఆలోచిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు బాలికల బీసీ సంక్షేమ వసతిగృహంలో ముగ్గురు విద్యార్థినులకు, ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ సంఘటనతో స్థానికలు భయాందోళనకు గురవుతున్నారు. వసతి గృహంలో విధ్యార్ధినులు, సిబ్బంది కరోనా భయంతో వసతి గృహం ఖాళీ చేసి సొంత ఇళ్లకు చేరుకున్నారు. 14 రోజులపాటు వసతి గృహాన్ని మూసివేస్తునట్లు అధికారులు తెలిపారు.