స్వామీజీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి – విష్ణు

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు తక్షణమే స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకొనే స్వామీజీపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలుస్తుంది. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల క్షేమం కోరుతూ విశాఖ శ్రీ శారదా పీఠం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాలు నిరహించే చంద్రబాబుకి అలాగే ఆయన అనుచరులకు స్వామీజీ గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. తక్షణమే బాబు స్వామీజీకి క్షమాపణలు చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.