చిన్నారికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసట

  • ఓ  చిన్నారి కోక్లియార్  ఇంప్లాంటేషన్ ఆపరేషన్  కై   విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  బాసట
  • పీ ఎం ఆర్  ఎఫ్  నుంచి మంజూరైన రూ.3లక్షల  ఎల్ ఓ సీ అందజేత
  • నేరుగా ఆసుపత్రి అకౌంట్ లో నగదు జమ చేశామని పీ ఎం  ఆఫీస్ నుంచి సందేశం 
  • హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

దీర్ఘకాలికంగా వినికిడి సంబంధిత వ్యాధితో తో బాధపడుతున్న ఓ చిన్నారికి   విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బాసటగా నిలిచారు .విశాఖపట్నం  శారదా నగర్  ప్రాంతానికి చెందిన గుంటముక్కల తాతారావు  చిన్నపాటి కార్పెంటర్ గా పనిచేస్తూ  ఆర్ధిక ఇబ్బందుల నడుమ కుటుంబపోషణ గావిస్తున్నాడు . ఈ క్రమంలో ఆయన కుమార్తె  జి .రచితమయి గత కొంత కాలంగా వినికిడి సంబంధిత వ్యాధితో బాధపడుతోంది .ఆ వ్యాధి చికిత్సకి సంబంధించి కోక్లియర్ ఇంప్లాంటేషన్  చికిత్స  అనివార్యం కావడంతో ,తక్షణ వైద్యం అవసరం అని  వైద్యులు సూచించారు .ఈ నేపథ్యంలో  ఆ కుటుంబ సభ్యులు సహాయార్ధం ఎంపీ ని ఆశ్రయించారు. స్పందించిన ఎంవీవీ ప్రధానమంత్రి   సహాయ నిధి కింద  వైద్య ఖర్చుల కింద సదరు వ్యక్తికి  ఆర్ధిక సహాయనికై  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు  . .  తదుపరి ఆసుపత్రి ఖర్చులకు రూ.3 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం  నుంచి  ఆమోదం లభించింది. ఆ మంజూరైన ఎల్ ఓ సీ లను వారి కుటుంబ సభ్యులకు లా సన్స్  బే కాలనీ లో ఉన్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ ఆఫీసు లో మంగళవారం  అందజేశారు. ఈ సందర్భం గా  చిన్నారి తండ్రి  తాతారావు   మాట్లాడుతూ ఆర్ధికంగా పరిపుష్టి లేని  తమకు దన్నుగా నిలిచి , ఈ సహాయం  తమకు అందజేసేందుకు కృషిచేసిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు. ఎంపీ మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలో  ఉన్న ప్రతి ఒక్కరికీ తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు.