ముగిసిన తిరుపతి ఉపపోరు ప్రచారం!

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది.ఆది నుంచే తిష్ట వేసిన కర్నూలు జిల్లా వైసిపి నేతలు చివరి వరకు చేయాల్సిందల్లా చేశారు.ఇక ప్రజా తీర్పే తరువాయి ప్రక్రియ.

ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారినా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో కర్నూలు మేయర్ బి.వై రామయ్య మరియు శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి లు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని యువతతో భేటి అయ్యారు.యువతకు వైసిపి ఇస్తున్నా ప్రాధాన్యత, ప్రభుత్వం వచ్చాక యువత కోసం చేపట్టిన కార్యక్రమాలు సమావేశంలో వివరించి, యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు.మండలంలో భారీ మెజార్టీ తెప్పియాలని ముందు నుంచి తీవ్రంగా శ్రమిస్తున్న బి.వై రామయ్య చక్రపాణి రెడ్డి లు చివరి రోజు వరకు అదే ఉత్సాహం చూపారు.

అదే విధంగా పోలింగ్ శాతంపై రెండు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది.పోలింగ్ శాతం పెరగకపోతే కష్టం అని ఇరుపార్టీలు భావిస్తున్నాయి.దీంతో పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో విసృతంగా పర్యటిస్తూ, పోలింగ్ శాతం పెరిగేలా చూసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి.