మారిటోరియం పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

గడిచిన ఏడాది మార్చి నుంచి ఆగష్టు వరకు లాక్ డౌన్ కారణంగా రుణాలపై మారటోరియం విధించారు.అయితే  ఆగష్టు నుంచి మారటోరియం ఎత్తివేయడంతో తమ రుణాలను తిరిగి చెల్లిస్తున్నారు రుణగ్రహీతలు.ఆ కాలంలో  కాలంలో రుణాల వడ్డీపై వడ్డీని వసూలు చేస్తున్నాయి సంబందిత సంస్థలు. దీనిపై ఇప్పటివరకు పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయిన సంగతి తెలిసిందే. వీటిపై సుదీర్ఘమైన విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక తీర్పును ఈరోజు వెల్లడించింది.  

మారటోరియం విషయంపై కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు తాము జారీ చేయలేమని,  ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కూడా ఆదేశించలేమని సుప్రీం కోర్టు తెలిపింది.  మారటోరియం కాలం పొడిగించాలని చెప్పేందుకు  సుప్రీంకోర్టు నిరాకరించింది.  రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని ఆదేశించలేమని కోర్టు పేర్కొన్నది.