బొదిరెడ్డి గోపి ప్రచార జోరు…

ఏలేశ్వరం మండలం ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా భద్రవరం గ్రామంలో వైఎస్సార్సీపీ యువనాయకుడు, కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృది పనులను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు తప్పనిసరిగా అందుతాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ నాయకత్వంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరు ఓటు వేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ బలపర్చచిన జడ్పిటిసి అభ్యర్థి నీరుకొండ రామకుమారి, ఎంపీటీసీ అభ్యర్థి కొప్పుల బాబ్జి లను అఖండ మెజార్టీ తో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్దించారు.