బాహుజనుల పాలిట ఆశాజ్యోతి .. అంబేద్కర్ – ఆలమండ చలమయ్య

నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు కంబాల పాలెం జై భీమ్ యూత్ సభ్యులు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగరంలో అంబేద్కర్ 130 జయంతి సందర్భాన్ని పురష్కారించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమలో యూత్ సభ్యలు రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. అనేక మంది అంబేద్కర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేసారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆలమండ చలమయ్య  పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్నికి పూల మాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం. ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ ప్రధాత మన బి. ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. ఇంతటి మహనీయుడు, పూజ్యుడు డాక్టర్ అంబేద్కర్ ఒక కులనికో, మాతానికో సంబంధించిన వ్యక్తి కాదని యావత్ భారత దేశం గర్వించదగిని వ్యక్తన్నారు చలమయ్య. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ వైస్ ఛైర్మన్ శిగడం వేంకటేశ్వర రావు, ఎమ్ ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి ఆనంతరపు రాజు మరియు కొప్పుల భూషణం, జొన్నాడ వీరబాబు లు పాల్గొన్నారు.  

     

Nanaji Bodasingu

Reporter