బాబుపై విరుచుకు పడ్డ సజ్జల

తాజాగా ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో అధికార దాహం కనిపిస్తోంది తప్ప ప్రజా సంక్షేమం ఆయనకు అక్కర్లేదని వ్యాఖ్యానించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. గురువారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచూపడ్డారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు మేము ఊహించినట్టే వచ్చాయి. చంద్రబాబు మాత్రం ఫలితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితల్లో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి అద్భుత పాలన చేశారు. అధికారానికి దూరం అవ్వాడమే కాకుండా భవిష్యత్ లో అధికారం దక్కదనే భయం చంద్రబాబులో కనబడుతుందని విమర్శించారు. మీడియా సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమంజసంగా లేవు. ఎన్నికల్లో విజయం సాధించనంత మాత్రం ప్రజలను చరిత్ర హీనులు అని వ్యాఖ్యానించడం తప్పు. తన కంటే వయసులోనూ, అనుభవం లోనూ చిన్నవాడైన జగన్ పాలన చూసి అసూయపడుతున్నారు. ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడం తప్ప చంద్రబాబుకి సూటిగా మాట్లాడే మనస్తత్వం ఇప్పుడు లేదు ఎప్పడూ రాదు.     

పనిలో పనిగా లోకేష్ ని కూడా విడిచిపెట్టలేదు సజ్జల. లోకేష్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. లోకేష్ కి తండ్రిగా ఆయన భాద ఉండడం లేదు.. కానీ చంద్రబాబు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని, వైసీపీ గెలిస్తే అక్రమాలు జరిగినట్టు మాట్లాడం విడ్డూరంగా ఉంది. ఫలితాల విషయంలో బాబు అన్నీ అబద్దాలే  చెప్పుకుంటూ వచ్చారు. ఇదెక్కడి వైఖరో అర్ధం కావడం లేదు.