తిరుపతిలో ఓడిపోతే టిడిపి మూసేస్తారా: బి.వై రామయ్య

• చంద్రబాబుకు కర్నూలు మేయర్ సవాల్
• రాళ్ళు వేయించుకోవడం, సొంత మామపై చెప్పులు విసిరేయించయడం బాబుకే చెల్లు.
• టిడిపి గెలుస్తుందని సర్వే చెప్తున్నాయంటున్న బాబు ఓడిపోతే టిడిపి మూసేస్తారా?
• వైసిపి మెజార్టీ లక్షల్లోనే ఉంటుంది.

నెల్లూరు: తిరుపతి ఉపఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి.ఇప్పటికే తిరుపతి పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనాయకులు మకాం వేసి ప్రచార హోరు కొనసాగిస్తున్నారు.తాజగా టిడిపి అధినేత చంద్రబాబు తిరుపతి ఎన్నికల్లో టిడిపి భారీ మెజారిటీతో గెలవబోతుందని అనేక సర్వేలు చెబుతున్నాయని చెప్పుకొచ్చారు.దీనిపై వైసిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు, కర్నూలు మేయర్ బి.వై రామయ్య ఘాటుగా స్పందించారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలానికి ఇంచార్జులుగా వ్యవహరిస్తున్న బి.వై రామయ్యతో పాటు శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి మంగళవారం మనుబోలులో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

అనంతరం ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ టిడిపి గెలుస్తామనే నమ్మకం ఉంటే అధినేత గల్లి గల్లి ఇల్లు ఇల్లు ఎందుకు తిరుగుతున్నారనీ ప్రశ్నించారు.ఒకవేళ ఓడిపోతే టిడిపి మూసేస్తారా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.మందుబాబులకు బాసటగా నిలుస్తున్న చంద్రబాబు మీద వాళ్ళ పార్టీ వ్యక్తే మందుమైకంలో దాడి చేసింటే, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అది వైసిపి మీద రుద్దుతున్నారని మండిపడ్డారు.రాళ్ళు వేయడం, సొంత మామ మీద చెప్పులు వేయడం అది వైసిపి సంస్కృతి కాదనీ, అది ఎవరి సంస్కృతినో ప్రజలకు బాగా తెలుసన్నారు.వైఎస్సార్ సిపి అభ్యర్థి డా.గురుమూర్తి గెలుపు ఖాయమేనని, మెజారిటీ లక్షల్లోనే ఉంటుందని దమ్ముంటే ఆపుకోవాలని బి.వై రామయ్య మరో సవాల్ విసిరారు.