ఘనంగా బాబూ జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

ఏలేశ్వరం నగర పంచాయితీ పరిధిలోని 11 వార్డులో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావు 113 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4 వార్డు కౌన్సిలర్, వైసీపీ నాయకులు బొద్దిరెడ్డి గోపి, జిల్లా దళిత నాయకులు కాకాడనాగేశ్వరావు మరియు అనంతరపురాజు, యండగుండినాగబాబు, గొడతరాజు వేమగిరి ప్రేమనదం,పలివేలనూకరాజు మరియు పెద్దవీధి బాబు జగజ్జివన్ రావు యూత్ సభ్యులు పాల్గొన్నారు.