కె.విశ్వనాథ్ పుట్టినరోజు ప్రత్యేకం

ప్రముఖ దర్శకుడు…రచయిత..నటుడు..సౌండ్ రికార్డిస్టు అయిన కె.విశ్వనాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా…..

!! తెలుగువారి ఆత్మగౌరవానికి….

   సంస్కృతి….సంప్రదాయాలను…

   ఆపాదించి….

   సాగరసంగమం గావించి….

   లలితకళలను తన కలగా మదించి…

   వెండితెరపై చిత్రీకరించి…

   శుభసంకల్పంతో….

   సినికళామాతల్లి మెడలో…..

   శంకరాభరణంగా అలంకరించి….

   భారతీయతను నలుదిశలా

   వ్యాపింపచేసి….

   శృతిలయలను….సిరివెన్నెలలో..

   హరిప్రసాద్ చౌరాసియా సృష్టించిన

   మురళీ మధురిమలను

   రాగం…తానం..పల్లవిలతో మేళవించి

   ప్రేక్షకులకు వినిపించే శుభోదయమై…

   సిరిసిరిమువ్వలను ఏర్చి కూర్చి..

   సరస్వతీ సుముఖంగా…శుభప్రదంగా

   స్వరాభిషేకం జరిపించి….

   సామాజిక అంశాలను సప్తపదిగా

   నడిపించి….

   జీవనజ్యోతి వెలుగులో…..

   ఆపద్బాంధవుడి పాత్ర పోషించి….

   తన ఉనికికి కారణమైన….

   తల్లిదండ్రులను సూత్రధారులుగా

   భావించి…..

   కాలం మారిందని…కొత్తతరానికి…

   మార్గనిర్దేశం చేస్తూ….

   నిండు హృదయంతో సినిలోకానికి

   రాసిన శుభలేఖలోని సువర్ణాక్షరాలు..

   వేద మంత్రాలయి ఆశీస్సులుగా

   అందించాలని కోరుకుంటూ…..

   కళాతపస్వి…సినీ పిపాసి…

   కాశినాధుని విశ్వనాథ్ గారికి

   పుట్టినరోజు శుభాకాంక్షలు……!!