ప్రధానికి కరోనా -సెల్ఫ్ ఐసోలేషన్‌లో ప్రధాని

పాకిస్థాన్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క శనివారం నాడే రికార్డ్ స్థాయిలో ఏకంగా 3,876 కేసులు నమోదు కావడం తో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల క్రితమే ఆయన వ్యాక్సిన్ మొదటి డోసును వేయించుకున్నా… కరోనా సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెల్ఫ్ ఐ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ తెలిపారు.  

ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఆరు లక్షల పైగా కేసులు నమోదు అయ్యాయని, గడిచిన 24 గంటల్లో 40 మందికి పైగా మృత్యువాత పడినట్లు అధికారిక బులెటినలో తెలిపారు. దీంతో ఇప్పటివరకు దేశం మొత్తం మీద మరణాల సంఖ్య 13 వేలకు పైచిలుకు నమోదయ్యింది.