ఏపీలో విజృంబిస్తున్నకరోనా

ఏపీలో కరోనా విజృంబిస్తుంది. కొత్తగా 310 కేసులు నమోదవ్వగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 8 లక్షల 94 వేలకు చేరగా మరణాల సంఖ్య 7 వేల పైచిలుకే అని తెలుస్తుంది. ఒక వైపు కరోనా టీకాల పంపిణీ జోరుగా చేపడుతున్న వారం పది రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనాపై యుద్దానికి జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది.

ఆంధ్ర ప్రదేశలో కరోనా మళ్ళీ పురి విప్పింది. గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూల్, కృష్ణ, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో  వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తిపై కలవరపడుతున్న వైద్య ఆరోగ్య శాఖ ఫుల్ ఫోకస్ పెట్టింది.

దాదాపుగా కరోనా కనుమరుగైపోయిన సమయంలో మరోసారి కరోనా కేసులు పెరగడం విజయనగరం జిల్లా వాసులకు అధికారులకు దడపుట్టిస్తుంది. గత వారం రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 47 మందికి పైగా కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా జిల్లాలో ఒక వ్యక్తి మృతి చెందడంతో జిల్లా వాసుల్లో టెన్షన్ మొదలైంది.

రాజమండ్రి సమీపంలో ఓ ప్రవేట్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న 56 మంది హాస్టలు విధ్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వీరంతా ఒకే బ్లాక్ లోని విధ్యార్ధులు. ఇదే బ్లాక్ లోని మరో 400 మంది విధ్యార్ధులకు పరీక్షలు చేశారు. నెటిగివ్ వచ్చిన విధ్యార్ధులతో పాటు మిగిలిన స్టూడెంట్ లను ఇళ్లకు పంపేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత పెరగుతుంది. మొన్నటి వరకు రోజుకు మూడు నాలుగు కేసులు నమోదు అవుతుంటే ఇప్పుడు సుమారు 10 కేసులు రావడంతో ఆందోళనలో పడ్డారు ప్రజలు. జిల్లాలో కరోనా తీవ్రత పెరిగిందని అధికారులు అంటున్నారు. కోనసీమ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రతి సచివాలయంలోను కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారంలో 8 వ తరగతి చదువుతున్న ముగ్గురు విధ్యార్ధినిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ సిబ్బంది అన్నీ పాఠశాలలో కరోనా టెస్ట్ లు చేయడాని సిద్దమయ్యారు.

కర్నూల్ జిల్లాలో గత వారం నించి కేసుల వేగం పెరిగింది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేసులు సంఖ్య పెరగడం ఆంధోళన గురి చేస్తుంది. ఇక్క కర్నూల్ నగరంలోనే 50 కేసులు వరకు ఉన్నాయి.

ఏదిఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకుండా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.