ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు – ఉత్తమ్

రాష్ట్రాన్ని మత పరంగా విభజించి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్ధి రాములు నాయక్ పరిచయ సభలో ఆయన మాట్లాడురారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదని చెప్పుకొచ్చారు.యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ఓటు అడిగే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. అదేవిధంగా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోడి కూడా యువతను మోసం చేశారని పేర్కొన్నారు.